November 7, 2026
Explore
అండర్‌-17 కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

అండర్‌-17 కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

November 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బసవరాజ హైస్కూల్‌లో అండర్‌-17 కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఎంఈవో నటరాజరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి హాజరైన బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను పంపుతున్నట్లు ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు నీతిన్‌, జ్యోతి, ఆమని, మధురిమ, చంద్రశేఖర్‌తో పాటు విశ్రాంత పీడిలు రామచంద్ర, వెంకటేష్‌ ఎంపికలో పాల్గొన్నారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా స్కూల్‌గేమ్స్ సెక్రటరీ రమేష్‌బాబు పర్యవేక్షించారు.

Tags: Selection for the Under-17 District Kabaddi Team