November 6, 2026
Explore
పెండింగ్ లో ఉన్న 23 మున్సిపాలిటీలకు వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్!

పెండింగ్ లో ఉన్న 23 మున్సిపాలిటీలకు వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్!

November 6, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈనెల 10 నుంచి 12 మధ్యలో నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో పెండింగ్లోని 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మేయర్/ఛైర్పర్సన్, డివిజన్లు/వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈనెల 10 నుంచి 12 మధ్య ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 25వ తేదీలోపు మొత్తం ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో అక్టోబర్ 14న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో వీటి ప్రస్తావన లేదు. కేసుల పరిష్కారంతో వీటిలో ఎన్నికల నిర్వహణకు పురపాలకశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్లు/వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల తయారీ, వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసిన యంత్రాంగం.. తాజాగా రిజర్వేషన్లు ఖరారు చేసింది.

పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నాగపంచాయితీలు 23

శ్రీకాకుళం, రాజమహేంద్రవరం కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి, ఆముదాలవలస, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, గూడూరు కందుకూరు, కావలి, నరసరావుపేట, పొన్నూరు, రాజాం, శ్రీకాళహస్తి, తాడిగడప, బాపట్ల, అల్లూరు, చింతలపూడి, పొదిలి, బి.కొత్తపేట

Tags:Election notification for the 23 pending municipalities to be issued within a week!