November 6, 2026
Explore
ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

November 6, 2026 | Andhra Pradesh

-ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లెముచ్చట్లు:

మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు.

సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఐఏఎస్, డీఎస్పీ బి. ప్రసాద్, ఎన్నికల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు.

భద్రత దృష్ట్యా కేంద్రం వద్ద పటిష్ట మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు.

అధికారిక పాసులు ఉన్నవారిని మాత్రమే తనిఖీ అనంతరం లోపలికి అనుమతిస్తారు.

కౌంటింగ్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులపై పూర్తి నిషేధం విధించారు.

నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిసేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

Tags:Arrangements for MPTC and ZPTC vote counting are complete.