November 6, 2026
Explore
జర్నలిస్టుపై దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలి

జర్నలిస్టుపై దాడి చేసిన సీఐని సస్పెండ్ చేయాలి

November 6, 2026 | Andhra Pradesh

– ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ డిమాండ్..!

పుంగనూరుముచ్చట్లు:

జర్నలిస్టులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ సంఘాల నాయకులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా వి.కోటలో స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో ఉన్న ఎన్‌టీవీ జర్నలిస్ట్ అక్రమ్‌పై దురుసుగా ప్రవర్తించి, చొక్కా పట్టుకుని తోసివేసిన సీఐ సోమశేఖర్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ పుంగనూరులో జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ డిప్యూటీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో భాగంగా వార్తా సేకరణ చేస్తున్న జర్నలిస్ట్ అక్రమ్‌పై సీఐ అందరి సమక్షంలో దురుసుగా ప్రవర్తించి, చొక్కా పట్టుకుని తోసివేయడం జర్నలిస్టులకు తీవ్ర అవమానమని అన్నారు. ఇలాంటి చర్యలు జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. సీఐ సోమశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్ రాజు, తల్లా శ్రీనివాస్, చిన్నస్వామి, మహమ్మద్ సైఫుల్లా, జగదీష్ కుమార్, జావీద్, భాను ప్రకాష్, మంజునాథ్, రెడ్డి రాజా, పురుషోత్తం, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:The CI who attacked the journalist should be suspended.