November 4, 2026
Explore
పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

November 4, 2026 | Andhra Pradesh

37 పోలింగ్ కేంద్రాలు.. ఎనిమిది రూట్లుగా విభజన

150 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు

సుండుపల్లిముచ్చట్లు:

సుండుపల్లి మండలంలో నవంబరు 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సుండుపల్లి సీఐ సురేష్‌రెడ్డి, ఎస్సై కె. అమర్‌నాథరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మండలంలోని 37 పోలింగ్ కేంద్రాలను ఎనిమిది రూట్లుగా విభజించి నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల బందోబస్తు కోసం ఎనిమిది మంది ఏఎస్సైలు, నలుగురు ఎస్సైలు, ముగ్గురు సీఐలు సహా మొత్తం 150 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తగిన భద్రత కల్పించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ, ఎస్సై సూచించారు.

Tags:Tight security arrangements for polling