November 4, 2026
Explore
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై టీడీపీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై టీడీపీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం

November 4, 2026 | Andhra Pradesh

రాయచోటిముచ్చట్లు:

రాయచోటి–మదనపల్లె రోడ్డులోని పీసీఆర్ ఫంక్షన్ హాల్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కార్యాచరణ, పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పార్టీ అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Tags: Minister provides guidance to TDP ranks regarding MPTC and ZPTC elections