అన్నమయ్యముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలాల వారీగా పోలీసు సిబ్బందికి ముందస్తు అవగాహన కల్పించి, భద్రతా విధులపై సూచనలు అందించారు. పోలీసుల పహారాలో ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సిబ్బందితో కలిసి పోలీసులు కేంద్రాలకు చేరుకుంటున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Tags:Everything is set for MPTC and ZPTC elections: District SP