రాయచోటి ముచ్చట్లు:
ప్రజా తీర్పుతో స్వేచ్ఛ యుద్ధంగా జరగాల్సిన ఎన్నికల మిద్దె లాగా జరుగుతున్నాయి.
కలెక్షన్స్, సెలక్షన్, నో ఎలక్షన్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి ప్రజల స్వేచ్ఛను హరింపజేశారు.
ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే భయం, వేసిన నామినేషన్ నిలుపుకోవాలంటే భయం, ప్రచారం చేయాలంటే భయం, పోలింగ్ నిర్వహించాలంటే భయం, కౌంటింగ్ అన్న భయం
ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకుండా చేశారు.
మాజీ ముఖ్యమంత్రి ఓటు వేసేందుకు ఆయన హెలికాప్టర్ కు అనుభవించి చివరి నిమిషంలో గాల్లోనే నిలిపివేసిన ప్రభుత్వ కుట్ర కుతంత్రాన్ని ప్రజలందరూ గుర్తించారు.
80 పోలింగ్ బూతులు ఉన్న 70 పోలింగ్ బూతుల్లోకి టిడిపి గుండాలు అనుమతించకపోవడం అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని నిలబడడం ప్రజలందరూ గమనించారు.
కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, పుంగనూరు ఎన్నికలకు ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చలు తెచ్చే పెట్టేలా పాలకులు, అధికారులు వ్యవహరించారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులు అభ్యర్థులనే కాదు ఓటర్లను కూడా వదలకుండా భయభ్రాంతులకు.
గతంలో వైఎస్సార్సీపి ప్రభుత్వంలో రాజకీయాల కు ఆతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి లభించింది.
ప్రజాసేవ చేయడానికి గద్దనెక్కిన పాలకులు నేడు వైఎస్ఆర్సిపి సానుభూతిపరులకు ప్రభుత్వపరమైన సంక్షేమ వృద్ధి అందించాలంటే పాముకి పాలు పోసినట్లే అంటూ సాక్షాత్తు చంద్రబాబు చెప్పుకొస్తున్నారు.
అధికారులు అయితే పోటీ చేసే అభ్యర్థులను ఎన్నికల నోటిఫికేషన్ వేలువడవడక ముందే అక్రమ కేసులు, బైండోవర్ కేసులు, పాత కేసులు అంటూ బెదిరింపులకు గురి చేశారు.
ఈ మాత్రం దానికి ఎన్నికల సంఘం ఎందుకు ఎన్నికలు ఎందుకు?
ప్రభుత్వమే జీఒ జారి చేసి ఫలానా వ్యక్తి చైర్మన్ ఫలానా వ్యక్తి కౌన్సిలర్ అని ప్రకటించేస్తే సరిపోతుంది కదా?
రాప్తాడులో రంపంతో కోసి చంపేసిన పరిస్థితి. గంజాయి ముకుల పేట్రేగిపోతున్న అరికట్టే పరిస్థితి లేదు.
ఓటమి ప్రభుత్వంలో పచ్చ బిళ్ళలు వేసుకునే వారే ప్రజలు, మిగతావారు ప్రజలు కాదు అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
రాష్ట్రంలో కరువు విలయకాండవం చేస్తుంటే పట్టించుకునే పాపాన ఈ ప్రభుత్వం లేదు.
రైతులను గాలికి వదిలేసారు రైతులకు పంట నష్టపరిహారంతో పాటు ప్రీమియం కట్టించుకున్న ఇన్సూరెన్స్ తో సహా పరిహారం అందించాలి.
రానున్న కరువును నివారించడానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం దారుణం.
50 ఏళ్లు నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్లు ఎక్కడ?
ఇంతవరకు ఒక్క పక్క గృహం ఇచ్చిన పాపాన పోలేదు.
మహిళలకు 1500 లేదు, నిరుద్యోగులకు భృతి లేదు.
మహిళలకు రక్షణ లేదు భద్రత కరువైంది
ఇక రాయచోటి నాయకులైతే ఒక అడుగు ముందుకేసి రాయచోటి ను చంద్రబాబు గిఫ్ట్ గా ఇస్తామన్నారు.
చంద్రబాబు నుంచి రిటర్న్ గిఫ్ట్ ఆశించరా?
జిల్లాను తిరిగి తెస్తారా? జిల్లాను తిరిగి తెచ్చే ధైర్యం లేని వారికి ఇలాంటి విజయాలు ఎందుకు?
అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు రాజంపేట, మదనపల్లి ని కాదని వెనుకబడిన ప్రాంతం రాయచోటి అభివృద్ధి చేయడానికి జిల్లా కేంద్రం తెచ్చాం.
రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో రాయలసీమలో అభివృద్ధి చెందిన పట్టణంలో రాయచోటి ఒకటిగా నిలిచింది
కానీ నేడు అభివృద్ధిలో రాయచోటి పాతాళానికి దిగిపోవడమే కాక శాంతిభద్రతలు లోపించాయి.
20 ఏళ్ల క్రితం నాటి అల్లర్లు మళ్లీ రాయ చోటిలో చెలరేగాయి.
గ్రామస్తులు పట్టణానికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది, రాయచోటికి రావాలంటే భయపడుతున్నారు.
ప్రజలంతా గమనించారు తమకు ఉన్న ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించుతారు.
రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి పథంలో,నడిపించడంతోపాటు, శాంతిని నెలకొల్పేలా చేస్తామని తెలిపారు.
Tags;Comments made by State General Secretary Gadikota Srikanth Reddy during a press meet at the YSRCP office in Rayachoti