November 4, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

November 4, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

నవంబర్ 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు

అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 8,28,651 మంది ఓటర్లు ఉండగా, 1,002 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో 294 అతి సమస్యాత్మక, 380 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. 674 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 328 కేంద్రాల్లో వీడియోగ్రఫీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని, ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

Tags:Everything is set for MPTC and ZPTC elections in Annamayya district