November 4, 2026
Explore
మదనపల్లిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

మదనపల్లిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

November 4, 2026 | Andhra Pradesh

మదనపల్లిముచ్చట్లు:

మదనపల్లిలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ బుధవారం పరిశీలించారు. 11 మండలాల పరిధిలోని 507 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర నిఘా, పటిష్టమైన పోలీసు భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈవో లక్ష్మీపతి తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:Joint Collector inspects election arrangements in Madanapalle