November 4, 2026
Explore
ఎన్నికల విధులకు 76 ఆర్టీసీ బస్సులు కేటాయింపు

ఎన్నికల విధులకు 76 ఆర్టీసీ బస్సులు కేటాయింపు

November 4, 2026 | Andhra Pradesh

4, 5వ తేదీన ప్రయాణికులకు బస్సుల కొరత.. 6వ తేదీ నుంచి యథావిధిగా సర్వీసులు

మదనపల్లిముచ్చట్లు:

ఈ నెల 5వ తేదీన జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ విధుల నిమిత్తం ఓటర్ల తరలింపునకు మదనపల్లి ఆర్టీసీ నుంచి మొత్తం 76 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందులో మొదటి డిపో నుంచి 38, రెండో డిపో నుంచి 38 బస్సులను పంపనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ నుంచి రామసముద్రానికి ఒకటి, కందూరుకు ఒకటి, పీలేరుకు నాలుగు బస్సులతో పాటు తిరుపతికి మూడు నాన్‌స్టాప్, మూడు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. ఈ నెల 5వ తేదీన కూడా బస్సులు అందుబాటులో ఉండవని, 6వ తేదీ నుంచి యథావిధిగా అన్ని బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తామని డీఎం లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Tags:76 RTC buses allocated for election duties