పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు మండల వైఎస్సార్‌సిపి జెడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీటీసీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని జెడ్పిటిసి అభ్యర్థి వెంకటరమణ మండల ప్రజలను కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అరాచకాలు, అక్రమాలతో స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను పోటీ చేయనివ్వకుండ , ఎన్నో కష్టాలు పెడుతోందన్నారు. ఎన్ని కష్టాలు పెట్టిన భయపడేది లేదని, కేసులకు పారిపోయేది లేదని ఆయన తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్సార్‌సిపి అభ్యర్థులంత పోటీలో నిలిచామన్నారు. గురువారం జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సిపికి ఓట్లు వేసి జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు స్థానిక సంస్థల్లో పునాదులు వేయాలని కోరారు. ఎన్ని కష్టాలు పెట్టిన ధైర్యంగా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, తమను గెలిపించాలని కోరారు.
Tags:Vote for the ‘fan’ symbol – ZPTC candidate Venkataramana’s appeal