తిరుపతి ముచ్చట్లు:
నవంబరు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు 8వ తేదీన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు దీపావళి ఆస్థానాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక ఆస్థానం నిర్వహించనున్నారు.
నవంబరు 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని నవంబరు 5వ తేదీన ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పరిమళాన్ని గోడలకు పూస్తారు.
ఈ పవిత్ర కార్యక్రమం అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
భక్తులు ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను గమనించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.
Tags: Deepavali Asthanam to be celebrated grandly at the Sri Govindaraja Swamy Temple on November 8