November 4, 2026
Explore
నవంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

నవంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

November 4, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

వివిధ పర్వదినాలు, ఆళ్వార్ల శాత్తుమొరలు, స్వామివారి వీధి ఉత్సవాలు

తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష పర్వదినాలు, ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవార్లు వివిధ వాహనాలు, తిరువీధి ఉత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • నవంబరు 5: ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
  • నవంబరు 6, 20, 27: శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
  • నవంబరు 11: తిరుమల నంబి శాత్తుమొర నిర్వహించనున్నారు.
  • నవంబరు 13: శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ మనవాళ మహామునితో కలిసి సాయంత్రం మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
  • నవంబరు 14: సేనాధిపతి శాత్తుమొర ఉత్సవం నిర్వహించనున్నారు.
  • నవంబరు 16: శ్రీ పోయిగై ఆళ్వార్ తిరునక్షత్రం నిర్వహించనున్నారు. అదే రోజున శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు ఉభయ నాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
  • నవంబరు 21: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్రవచనం నిర్వహించనున్నారు.
  • నవంబరు 24: శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
  • నవంబరు 25: రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ విశేష ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి, అమ్మవార్ల దివ్య మంగళ దర్శనం చేసుకుని వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.

Tags:Special festivals at the Sri Govindaraja Swamy Temple in November