తిరుపతి ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబరు 7 నుండి 20వ తేదీ వరకు అందించనున్నారు. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. పింఛన్‌దార్లు తమ స్మార్టు కార్డు చూపి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ పొందవచ్చు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. నవంబరు 7న 164 నుండి 3,250 వరకు, నవంబరు 9 నుండి 13వ తేదీ వరకు 3,251 నుండి 9,050 వరకు, నవంబరు 16 నుండి 19వ తేదీ వరకు 9,051 నుండి 12,550 వరకు, నవంబరు 20న 12,551 నుండి మిగిలిన పింఛన్‌దారులందరికీ ప్రసాదాలు అందిస్తారు.
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.
Tags: Distribution of Srivari Laddu and Vada prasadam to retired TTD employees from the 7th to the 20th