November 3, 2026
Explore
టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

November 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తెల్లవారుజామున 03:30 గంటలకు మురసు తుఫాన్ పరిస్థితిపై మరోసారి జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

మురసు తుఫాన్ 01 గంటకు తీరాన్ని తాకిందని… ఉదయం 06:30 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటుతుందని చెప్పిన అధికారులు

ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తీరాన్ని మురసు తుఫాన్ తాకినట్టు తెలిపిన అధికారులు

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జనం రోడ్లపైకి రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచన

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ల పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా

ప్రస్తుతం విద్యుత్ స్తంభాలు ఎక్కడా పడిపోలేదని… విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం లేదని తెలిపిన విద్యుత్ శాఖ అధికారులు

ఎక్కడా ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచన

ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత మేరకు నివారించాలన్న ముఖ్యమంత్రి

జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

  • బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని… కొన్ని చోట్ల చెట్లు కూలిపోగా వెంటనే తొలగించామని తెలిపిన బాపట్ల జిల్లా కలెక్టర్.
  • రేపల్లె, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురుస్తోందని చెప్పిన బాపట్ల కలెక్టర్.
  • నెల్లూరులో 7 చోట్ల చెట్లు కూలిపోయాయని వెంటనే తొలగించామని తెలిపిన కలెక్టర్ హిమాన్షు శుక్లా.
  • ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన కలెక్టర్.
  • ఒంగోలు జిల్లాలో 5 ప్రాంతాల్లో చెట్లు పడిపోయినట్టు సమాచారం రాగానే చర్యలు చేపట్టామన్న కలెక్టర్ రాజాబాబు.
  • కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక వంటి ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురుస్తోందని తెలిపిన కలెక్టర్.
  • గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని… ఎక్కడా విద్యుత్ స్థంభాలు, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పిన కలెక్టర్.
  • ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయని చెప్పిన కలెక్టర్ లక్ష్మీషా.
  • బుడమేరు పరిధిలో పర్యటించామని… ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.
  • మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడతాయనే ముందు జాగ్రత్తలో భాగంగా కొన్ని కుటుంబాలను శిబిరాలకు తరలించామన్న లక్ష్మీషా.
  • తుఫాన్ సహయక చర్యలు తీసుకుంటూనే స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు చర్యలు తీసుకున్నామని తెలిపిన కలెక్టర్లు.
  • గత రాత్రి 10:00 గంటలకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి
  • రాత్రి నుంచి ప్రతి గంటకూ అధికారుల నుంచి సమాచారం తీసుకుంటూనే ఉన్న సీఎం చంద్రబాబు
  • సోమవారం నాడు అంతా ఆర్టీజీఎస్‌లోనే ఉండి మురసు తుఫాన్‌పై సమీక్షించిన ముఖ్యమంత్రి
  • సోమవారం నాడు వివిధ శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ మూడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించిన సీఎం చంద్రబాబు

Tags: Chief Minister Chandrababu held a teleconference