పుంగనూరుముచ్చట్లు:
ఈనెల 5న జరగనున్న ఎంపీటీసి, జెడ్పిటిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీంగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీంగ్ సమయంలో ఓటర్లపై దాడులు, అరాచకాలు, ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో అరాచకాలు చేసే వారిపై తమకు సమాచారం అందిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags: Cooperate for peaceful polling