పుంగనూరుముచ్చట్లు:
స్థానిక పుంగనూరు మున్సిపాలిటి ఎన్నికల్లో వైఎస్సార్సిపి, సీపీఐ పార్టీలను నామినేషన్ వేయనివ్వకుండ తెలుగుదేశం పార్టీ వారు, అనుచరులు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. కానీ సీపీఐ అభ్యర్థి చందు ఎన్నికలోల పోరాటం చేసి 11వ వార్డు నుంచి చందు అనే మహిళ మంగళవారం ఎన్నికైంది. తన సమీప కూటమి అభ్యర్థిపై 6 ఓట్లు తేడాలతో విజయవం సాధించింది. ఈ సందర్భంగా సీఐపీ జిల్లా నాయకుడు జనార్ధన్ , జిల్లా కార్యదర్శి మహేష్, స్థానిక నాయకులు రామమూర్తి, మున్న, వెంకట్రమణారెడ్డి లు కలసి సంబరాలు చేసుకున్నారు. జనార్ధన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాచే ప్రభుత్వానికి సీపీఐ విజయం గుణపాఠం కావాలని సూచించారు. ప్రజలు తలచుకుంటే తీర్పు ఎలా ఉంటుందో ప్రభుత్వాలు గమనించాలన్నారు.
Tags;CPI, which fought against and triumphed over government atrocities