పుంగనూరుముచ్చట్లు:
పెట్రోల్‌పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితుడి వాగ్మూలాన్ని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరేష్‌కుమార్ రికార్డు చేసిన సంఘటన మంగళవారం జరిగింది. పెద్దపంజాణి మండలం కమ్మినాయునిపల్లెకి చెందిన గంగప్ప కుమారుడు బి.విష్ణు(30) కు ఒక మహిళతో సానిహత్యసంబంధం ఉంది. ఇలా ఉండగా కొద్ది రోజులుగా ఆమె ఇతనిని నిరాకరించడంతో మనస్థాపానికి గురైన విష్ణు తన ఇంట్లో పెట్రోల్ శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పివేసి, కాలిన శరీరంతో ఉన్న విష్ణును పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసుల అభ్యర్థన మేరకు న్యాయమూర్తి పరేష్‌కుమార్ బాధితుడు వాగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Judge Pareshkumar recorded the victim’s statement.