November 3, 2026
Explore
ఎన్నికల ప్రచారంలో విషాదం

ఎన్నికల ప్రచారంలో విషాదం

November 3, 2026 | Andhra Pradesh

  • వైఎస్సార్‌సిపి కార్యకర్త మృతి
    -ఎమ్మెల్యే, ఎంపి సంతాపం

పుంగనూరు ముచ్చట్లు:

స్థానిక ఎంపీటీసీ ,జెడ్పిటిసి ఎన్నికల ప్రచారం సాగుతున్న వేళ మంగళవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని యల్లారుబైలు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సిపి కార్యకర్త వై.నరసింహారెడ్డి (59) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో ఈసంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తి ఒక్కసారిగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు , గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Tags: Tragedy during election campaigning