November 3, 2026
Explore
నాయిబ్రాహ్మణ నూతన అధ్యక్షుడుగా ఉమాశంకర్‌

నాయిబ్రాహ్మణ నూతన అధ్యక్షుడుగా ఉమాశంకర్‌

November 3, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో నాయిబ్రాహ్మణ సంఘ సమావేశం త్యాగరాజస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించారు. ఈసమావేశంలో సంఘ నూతన అధ్యక్షుడుగా ఉమాశంకర్‌ను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా రమణ, సహాయకార్యదర్శిగా గంగాధర్‌, కోశాధికారిగా అమర తో పాటు సభ్యులుగా రమేష్‌, ప్రశాంత్‌, మల్లికార్జున, నాగ, నగేష్‌ , అక్కులప్ప, ప్రకాష్‌, మణి, ఉదయ్‌, కార్తీక్‌లు ఎన్నికైయ్యారు. నూతన అధ్యక్షుడు ఉమాశంకర్‌ మాట్లాడుతూ నాయిబ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సంఘం సభ్యులందరిని కలుపుకుని ముందుకు సాగుతామని , నాయిబ్రాహ్మణుల సంక్షేమం, ఐక్యత, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

Tags: Umashankar appointed as the new president of the Nai Brahmin community