November 2, 2026
Explore
తమిళనాడు, కర్ణాటక సీఎంలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

తమిళనాడు, కర్ణాటక సీఎంలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్

November 2, 2026 | Andhra Pradesh

తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ పునరుద్దరణ పనులకు సిబ్బందిని పంపాలని పొరుగు రాష్ట్రాల సీఎంలను కోరిన సీఎం చంద్రబాబు

అమరావతిముచ్చట్లు:

మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందనే సూచనలను దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయ్, డీకే శివకుమార్ లతో ఆదివారం సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బందిని, యంత్రాలను పంపాలని రెండు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు. దీనిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. ఏపీకి అవసరమైన మేరకు సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ఏపీ అధికారులు ఇరు రాష్ట్రాలకు చెందిన శాఖాధికారులను సంప్రదిస్తారని సీఎం చంద్రబాబు వారితో చెప్పారు. అర్నబ్ తుఫాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్దరించే పనుల నిమిత్తం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారు. మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్దరణ పనులను ముగించుకున్న పలువురు విద్యుత్ శాఖ సిబ్బందిని ముందు జాగ్రత్తగా మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉంచింది.

Tags:Chief Minister Chandrababu calls the Chief Ministers of Tamil Nadu and Karnataka