November 2, 2026
Explore
మురసు’ తుపాను హెచ్చరిక – అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పిలుపు

మురసు’ తుపాను హెచ్చరిక – అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పిలుపు

November 2, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

‘మురసు’ తుపానుతో పెనుగాలులు, భారీ వర్షాల ముప్పు ఉందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలవద్దని, తెగిన తీగలను తాకవద్దని సూచించారు. వాగులు, కాలువలు దాటవద్దని, నీరు చేరిన రోడ్లపై రాకపోకలు నిలిపివేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలు మండల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సహాయం కోసం డయల్ 112 కు కాల్ చేయాలని కోరారు.

Tags;’Murasu’ Cyclone Warning – SP Urges Vigilance