అమరావతిముచ్చట్లు:
మురసు’ తుఫాన్ ప్రభావంతో నేడు గుంటూరు, కృష్ణా, పల్నాడు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ క్రమంలో నేడు, రేపు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా మురసు తుఫాన్ ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటనుంది.
‘మురసు’ తుపాను దృష్ట్యా ‘కంట్రోల్ రూమ్’ నంబర్లు ఏర్పాటు చేసిన ‘విద్యుత్ శాఖ’..!
కృష్ణా జిల్లా : 6281709355, ఎన్టీఆర్ జిల్లా : 9440817561,
గుంటూరు : 9440817526, బాపట్ల : 9281413774,
ప్రకాశం : 9440817491, పల్నాడు : 7661019447
Tags:Extremely heavy rains.. Holiday for schools in these districts