November 2, 2026
Explore
సచివాలయాలు, ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా సేవలు

సచివాలయాలు, ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా సేవలు

November 2, 2026 | Andhra Pradesh

నేటి నుంచి స్లాట్ బుకింగ్

అమరావతిముచ్చట్లు:

దివ్యాంగులు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ నమోదుకు నేటి నుంచి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

గ్రామ, వార్డు కార్యాలయాలు, ‘మన మిత్ర’’ వాట్సాప్, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

21 కేటగిరీల్లో వైకల్యాలకు వేర్వేరుగా స్లాట్లు కేటాయించనున్నారు.

యాసిడ్ దాడి, అభ్యాస వైకల్యం, ఆటిజం, బహుళ వైకల్యం వంటి కొత్త కేటగిరీలకు వేర్వేరుగా స్లాట్లు నమోదు చేసుకోవాలి.

స్లాట్ నమోదుకు వెళ్లేవారు ఆధార్ కార్డుతో పాటు దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్ కూడా వెంట తీసుకెళ్లాలి.

మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009

Tags:Services through secretariats and the ‘Mana Mitra’ WhatsApp channel