అన్నమయ్య ముచ్చట్లు:
– అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
నేడు, రేపు జిల్లాలో వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అందుబాటులో ఉంచాలి.
తహసీల్దార్లు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలి.
చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.
పిడుగుల ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించాలి.
ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, జనరేటర్లు, పవర్ బ్యాకప్ సిద్ధంగా ఉంచాలి.
రెస్క్యూ బృందాలు, బోట్లు, లైఫ్ బాయ్‌లు, అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచాలి.
రహదారులు, కల్వర్టులకు నష్టం వాటిల్లితే తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు
ఈనెల 5న జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత శిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి.
శిక్షణకు నియమితులైన సిబ్బంది గైర్హాజరు కాకుండా చూడాలి.
శిక్షణ కేంద్రాల్లో ప్రాక్టికల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలి.
శిక్షణ కార్యక్రమాలను డివిజనల్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి.
తుఫాను ముందస్తు జాగ్రత్తలు, ఎన్నికల విధులు సమాంతరంగా కొనసాగుతున్నందున అధికారులు అప్రమత్తంగా, సమన్వయంతో పనిచేయాలి.
Tags: Remain alert regarding the impact of Cyclone Murasu.