November 2, 2026
Explore
ఈ దొంగలు దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచారో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే

ఈ దొంగలు దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచారో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే

November 2, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో సంచలనం సృష్టించిన రూ. 15 లక్షల దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు దిగి, వ్యాపారి సొమ్మును దోచుకెళ్లిన ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు లో పనిచేస్తున్న రఫీ అనే వ్యక్తి నిన్న సాయంత్రం కంపెనీకి చెందిన రూ. 15 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకుని బైక్‌పై విజయవాడ బయలుదేరాడు. మార్గమధ్యలో షేక్ జానీ, షేక్ సురాజ్, షేక్ నాగూర్ అనే ముగ్గురు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు.

తాము పోలీసులమని చెప్పి రఫీని తీవ్రంగా బెదిరించారు. అనంతరం ఆయన వద్ద ఉన్న రూ. 15 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌తో పాటు మూడు సెల్‌ఫోన్లను లాక్కుని అక్కడ నుంచి పారిపోయారు

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు రఫీ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలోని, ప్రధాన రహదారిపై ఉన్న సిసిటివి కెమెరా విజువల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. విజువల్స్ ఆధారంగా నిందితులను పక్కాగా గుర్తించారు.

Tags:You’ll be absolutely floored when you find out where these thieves hid the loot they stole.