తిరుపతి ముచ్చట్లు:
- పుత్తూరు మున్సిపల్ ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు, దిశానిర్దేశం.
- సున్నిత, అత్యంత సున్నిత, సాధారణ పోలింగ్ కేంద్రాల వారీగా భద్రతా చర్యలు.
- మొబైల్ పార్టీల నిరంతర పర్యవేక్షణతో పాటు రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్, నాన్ స్ట్రైకింగ్ ఫోర్స్ మధ్య సమన్వయం.
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశం.
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు, శనివారం పుత్తూరు మున్సిపల్ ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించి ఎన్నికల భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాలను సున్నిత, అత్యంత సున్నిత, సాధారణ కేంద్రాలుగా గుర్తించి, వాటి వర్గీకరణకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మొబైల్ పోలీస్ పార్టీల ద్వారా పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని, రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్, నాన్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఏదైనా సమస్య ఎదురైన వెంటనే అదనపు ఎస్పీలు, డీఎస్పీల పర్యవేక్షణలో ఉన్న సంబంధిత రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్, నాన్ స్ట్రైకింగ్ ఫోర్స్, సాయుధ ప్రత్యేక దళం బృందాలకు సమాచారం అందించాలని, అదే సమయంలో ఉన్నతాధికారులకు కూడా తక్షణమే తెలియజేయాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే ఐదు మున్సిపాలిటీల పరిధిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ముఖ్యంగా సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు, నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పి పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బందికి కేటాయించిన విధులను సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేలా పోలీస్ శాఖ అన్ని విధాలా అప్రమత్తంగా ఉంటుందని జిల్లా ఎస్పి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి శ్రీలత (క్రైమ్)డిఎస్పీ రవికుమార్ (పుత్తూరు) కొండయ్య (ట్రాఫిక్ తిరుపతి) సీఐ,లు ఎస్ఐ,లు సిబ్బంది పాల్గొన్నారు
Tags:Robust security arrangements for municipal elections in a peaceful atmosphere.