October 31, 2026
Explore
రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం

రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం

October 31, 2026 | Andhra Pradesh

రాప్తాడు ముచ్చట్లు:


పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి.. గొంతు కోసిన దుండగుడు

రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కలకలం చోటుచేసుకుంది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది చెక్క మొద్దులు కోసే మిషన్‌తో దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో గోపిక లక్ష్మి అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దాడి ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
విద్యార్థినిపై దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Tags:Commotion at Raptadu High School