October 31, 2026
Explore
రేపు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, 13 కార్పొరేషన్లల్లో పోలింగ్‌

రేపు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, 13 కార్పొరేషన్లల్లో పోలింగ్‌

October 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


రేపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, 13 కార్పొరేషన్లల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

నవంబర్‌ 3న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇప్పటికే 17 మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లుగా కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లలో టీడీపీ-15, జనసేన, బీజేపీ ఒక్కోచోట ఏకగ్రీవమయ్యింది.

కడప జిల్లాలో కూటమి ఖాతాలోకి ఆరు పట్టణ స్థానిక సంస్థలున్నాయి.

మొత్తం వార్డుల్లో 21శాతంపైగా, డివిజన్లలో 12శాతంపైగా, 13 కార్పొరేషన్లలోని మొత్తం 922 డివిజన్లలో 118 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.

Tags:Polling to be held tomorrow in municipalities, nagar panchayats, and 13 corporations