October 31, 2026
Explore
మనస్థాపానికి గురై వ్యక్తి అదృశ్యం

మనస్థాపానికి గురై వ్యక్తి అదృశ్యం

October 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని అమర్నాథ్ మందుల దుకాణ యజమాని అమర్నాథ్ గత రెండు రోజులుగా కనపడలేదని కుమారుడు వైదేష్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు.. 8 ఏళ్ళు క్రితం మంజునాథ్, హరి అనే వారితో కలిసి మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ ఇంటి స్థలం కొనుగోలు చేశారు. స్థలం రిజిస్ట్రేషన్ కాక, మదనపల్లి కోర్టులో కేసు నడుస్తోంది. చెల్లించిన సొమ్ము వెనక్కు రాక, స్థలము ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈనెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:Person goes missing after becoming deeply distressed