అమరావతిముచ్చట్లు:
పుర, ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఇప్పటికే లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో 750 లైసెన్స్ తుపాకులు ఉండగా- వీటిలో సెక్యూరిటీ గార్డులు, క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసుల వద్ద 85 వరకు ఉన్నాయి. వీటిని మినహాయించి.. వ్యక్తిగత భద్రత, వివిధ రకాల లైసెన్స్‌దారుల వద్ద ఉన్న 665 తుపాకులను పోలీసులకు డిపాజిట్ చేశారు. వీటిని అనంతపురంలోని ఆర్మ్‌డ్ రిజర్వుడ్ కార్యాలయంలో భద్రపరిచారు.
★ ఇక 3,700 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా.. వీరిలో 1,300 రౌడీషీటర్లు ఉన్నారు. మద్యం, డబ్బు రవాణా నిరోధానికి జిల్లా, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 9, పట్టణాల్లో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. 28 లీటర్ల మద్యం, రూ.4.37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Tags: 665 firearms deposited in Anantapur