పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్రంలో 2029లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి గెలుపొందాలని అజ్మీర్ దర్గాలో ఆదివారం స్థానిక ముస్లింలు ప్రార్థనలు చేశారు. మైనార్టీ నాయకులు రజీఅహమ్మద్, మస్తాన్, ఫకృద్ధిన్, ఖాదర్‌బాషాలు అజ్మీర్‌కు వెళ్లారు. అజ్మీర్‌దర్గాలో చాదర్ అందజేసి దువ్వ చేశారు. పుంగనూరులో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి , ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కుటుంబం బాగుండాలని, వైఎస్సార్‌సిపి రాష్ట్రమంతా గెలుపొంది , వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Tags: Prayers offered at Ajmer Dargah for YSRCP’s victory in 2029.