October 27, 2026
Explore
జిల్లా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు – ఎస్పీ

జిల్లా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు – ఎస్పీ

October 27, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మంగళవారం జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. 24 గంటల తనిఖీలు చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే అక్రమ నగదు, మద్యం, కానుకల రవాణాను అడ్డుకునేందుకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, అక్రమాలు గమనిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Tags:Intensive checks at district borders – SP