అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశించారు. మంగళవారం మదనపల్లెలో జేసీ జూమ్ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా ముందస్తు లైసెన్స్ పొందాలని, ప్రతి స్టాల్ వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి బకెట్లు, ధరల పట్టిక ఉంచాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Tags:Safe arrangements for Diwali – License mandatory: JC