October 27, 2026
Explore
ఈసారి కాస్త ముందుగానే పీఎం కిసాన్ డబ్బులు..

ఈసారి కాస్త ముందుగానే పీఎం కిసాన్ డబ్బులు..

October 27, 2026 | Uncategorized

అకౌంట్లో డబ్బులు పడే తేదీ ఇదే.. 10 లక్షల మంది అవుట్!

అమరావతిముచ్చట్లు:

ప్రస్తుతం దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎల్‌నినో నేపథ్యంలో సరిగా వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

సరిగ్గా ఈ సమయంలోనే పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బందులు పడుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట కలిగించే ప్రకటన వచ్చింది. రైతులకు పంట సాయం కోసం ఉద్దేశించిన ప్రధాన మంతి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి. ఈ మేరకు నిధుల విడుదల అధికారిక తేదీని కేంద్రం ప్రకటించింది. ఇది వారి తక్షణ పెట్టుబడి అవసరాలకు, ఇతర ఖర్చులకు ఎంతగానో ఆసరాగా నిలవనుందని చెప్పొచ్చు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివి కొనుగోలు చేయొచ్చు. పీఎం కిసాన్ 24వ విడత నిధుల్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 30న గుజరాత్‌లోని బనాస్‌కాంఠా వేదికగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో పేర్కొన్నారు. అర్హులైన ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ కానున్నాయి. ఈసారి పీఎం కిసాన్ డబ్బులు కాస్త ముందుగానే పడుతున్నాయి. గతేడాది ఇదే కాలానికి నవంబర్ 19న తమిళనాడు కోయంబత్తూర్ వేదికగా 21వ విడత డబ్బులు పడ్డాయి. దీంతో 20 రోజుల ముందుగానే ఈసారి పడనుండటం గమనార్హం. ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ డబ్బులు ముందే పడనుండటం శుభపరిణామం.

పీఎం కిసాన్ ప్రభుత్వ పోర్టల్ ప్రకారం మొత్తం అర్హులైన 9.34 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు పడనున్నాయి. ఇందుకోసం మొత్తంగా రూ. 18680 కోట్లను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. అంతకుముందు పీఎం కిసాన్ 23వ విడత నిధుల్ని మోదీ వెస్ట్ బెంగాల్ హూగ్లీలోని తారకేశ్వర్ వేదికగా విడుదల చేశారు. అప్పుడు మొత్తం 9.44 కోట్ల మందికిపైగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. ఇది ఏప్రిల్- జులై కాలానికి కాగా ఇప్పుడు ఆగస్ట్- నవంబరుకు సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లలో వేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లబ్ధిదారుల సంఖ్య. అవును 4 నెలల కిందట జూన్‌లో 9.44 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 9.34 కోట్లకు తగ్గింది. అంటే సుమారు 10 లక్షల మంది ప్రయోజనం కోల్పోతున్నారన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ వీరి పేర్లను తొలగించొచ్చు. అనర్హులు అన్న కారణంతో తీసేయొచ్చు. ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు. అధికారికంగా వివరాలు మాత్రం తెలియరాలేదు. లబ్ధిదారుల సంఖ్య తగ్గిన విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గింది?

ఇక్కడ ప్రభుత్వం డిజిటల్ రికార్డుల ధ్రువీకరణను మరింత కఠినతరం చేయడమే ప్రధాన కారణం. అర్హులైన అసలైన రైతులకు నిధులు అందాలన్న ఉద్దేశంతో అనర్హుల్ని తొలగిస్తోంది. ముఖ్యంగా ఇ- కేవైసీ చేసుకోనివారు లబ్ధిదారులుగా ఉండరు. వ్యవసాయ భూమి రికార్డుల్ని పీఎం కిసాన్ పోర్టల్‌తో డిజిటల్‌గా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వివరాలు సరిపోలకున్నా, ఏమైనా లోపాలు ఉన్నా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు పొందుతున్న వారికి కూడా ప్రయోజనాలు దక్కకుండా చేస్తోంది. ముఖ్యంగా ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్నవారు, ప్రభత్వ ఉద్యోగులు, ఇంకా ఒకే కుటుంబంలో భార్యభర్తలు, తండ్రీకొడుకులు ఇలా డబ్బులు పొందుతున్న వారిని కూడా లిస్ట్ నుంచి తొలగిస్తోంది. ఇంకా వాలెంటరీ సరెండర్ ఆప్షన్ ద్వారా కూడా కొందరు ఈ ప్రయోజనాల్ని వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సాంకేతిక కారణాల వల్ల డబ్బును పొందలేకపోతున్న వారు, తమ వివరాల్ని పోర్టల్‌లో సరిచేసుకుంటే నెక్ట్స్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మళ్లీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
ఇ- కేవైసీ తప్పనిసరి

పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఇ- కేవైసీ కచ్చితంగా పూర్తి చేయాలని కేంద్రం సూచిస్తోంది. పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ పోర్టల్‌లో కూడా దీని గురించి తరచుగా గుర్తుచేస్తోంది. ఇ- కేవైసీని 3 విధాలుగా చేసుకోవచ్చు.

పీఎం కిసాన్ అఫీషియల్ పోర్టల్‌లో ఓటీపీ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ అఫీషియల్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు.
ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా బయోమెట్రిక్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
వీటితో పాటు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయడం కూడా తప్పనిసరి. ఇంకా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ఆప్షన్ డిసేబుల్ అయి ఉన్నా రైతుల అకౌంట్లోకి డబ్బులు రావు. రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పాస్ బుక్ వివరాలు, భూమి సమాచారం వంటివి సరిపోలకపోయినా డబ్బులు పడవు.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మీ ఖాతాలో డబ్బులు పడతాయో లేదో అని పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోం పేజీలోనే కిందికి స్క్రోల్ చేస్తే Know Your Status అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే అక్కడే Know Your రిజిస్ట్రేషన్ నంబర్ అన్నదానిపై క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా దానిని తెలుసుకోవచ్చు. వివరాలు ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ కనిపిస్తుంది. అక్కడ స్టేటస్‌లో ల్యాండ్ సీడింగ్, ఇ- కేవైసీ స్టేటస్, ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అన్నీ Yes అని ఉండాలి. ఇలా యెస్ అని ఉంటేనే మీ ఖాతాలో డబ్బులు జమవుతాయి.
బెనిఫిషియరీ లిస్ట్ కూడా చూసుకోవచ్చు

పీఎం కిసాన్ పోర్టల్‌లోనే బెనిఫిషియరీ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మీ ఊళ్లో లబ్ధి పొందుతున్న రైతుల వివరాలు అన్నీ ఉంటాయి. దీని కోసం బెనిఫిషియరీ లిస్ట్‌పై క్లిక్ చేసి, మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేరు సెలక్ట్ చేస్తే సరిపోతుంది. ఇందులో మీరు అర్హులై ఉంటే పేరు చూయిస్తుంది. సాంకేతిక కారణాలతో డబ్బులు ఆగిపోతే ఇందులో పేరు చూయించదు. అయితే మీ పేరు ఇందులో ఉన్నా డబ్బులు పడకపోతే అసలు సమస్య తెలుసుకోవడానికి నో యువర్ స్టేటస్ ద్వారా తెలుసుకోవాలి. అక్కడ సీడింగ్ వివరాల్ని సరిగా చెక్ చేసుకోవాలి.

మీకు అర్జెంట్‌గా డబ్బులు అవసరమా? ఆర్థిక అవసరాల కోసం లోన్ కోసం చూస్తున్నారా? అయితే రూ. 25 లక్షల వరకు రుణం పొందే అవకాశం. పది నిమిషాల్లోనే మీ ఖాతాలోనే నగదు జమ అవుతుంది. లోన్ పొందేందుకు క్లిక్ చేయండి.

Tags:PM Kisan funds to arrive a bit earlier this time..