మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం జడ్పీటీసీ స్థానానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం మదనపల్లెలోని జడ్పీటీసీ నామినేషన్ల కేంద్రానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి సోదరుడు బరిలోకి దిగడంతో చిన్నమండెంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
Tags: Minister’s brother files nomination for ZPTC