October 27, 2026
Explore
తమిళనాడులోని తేని జిల్లాలో సబ్‌జైల్‌ నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు పరారయ్యారు.

తమిళనాడులోని తేని జిల్లాలో సబ్‌జైల్‌ నుంచి ఏకంగా 17 మంది ఖైదీలు పరారయ్యారు.

October 27, 2026 | Uncategorized

తమిళనాడు ముచ్చట్లు:

సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. దీంతో పోలీసులు తేని నుంచి దిండిగల్‌ వరకు హైఅలర్ట్‌ ప్రకటించి గాలింపు చర్యలు చేపట్టారు.

పరారైన ఖైదీల్లో ఒకరిని తిరిగి అరెస్ట్‌ చేశారు. దాదాపు 16 ప్రదేశాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

జైలు వెనుక అటవీ ప్రాంతంలోకి వారు వెళ్లినట్లు భావిస్తున్నారు.

మూర్ఛ నాటకంతో సిబ్బందిని రప్పించి..

ఒక సెల్‌లో ఉన్న కొందరు ఖైదీలు పరారయ్యేందుకు తొలుత ఒకరు మూర్ఛ నాటకమాడినట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది ఆ గదిలోకి ప్రవేశించగానే.. దాడి చేసి పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.

Tags;In the Theni district of Tamil Nadu, as many as 17 prisoners escaped from a sub-jail.