October 13, 2026
Explore
కుప్పంలో అక్టోబరు 20న శ్రీ మహాలక్ష్మీ దీపపూజ

కుప్పంలో అక్టోబరు 20న శ్రీ మహాలక్ష్మీ దీపపూజ

October 13, 2026 | Uncategorized

తిరుపతి ముచ్చట్లు:

భక్తులకు పటిష్ట ఏర్పాట్లు : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్

కుప్పం విలజాపురం రోడ్డు, చెరువు కట్ట సమీపంలోని శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవ ప్రాంగణంలో అక్టోబరు 20న సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీపపూజకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా భక్తుల కోసం షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

భక్తులు ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో దీపపూజలో పాల్గొనేలా చూడాలని, భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పోలీసు, మున్సిపల్‌, టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీప పూజకు జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారం, సీఈ మనోహరం, ఎస్ ఈ వేంకటేశ్వర్లు, విజీఓ గిరిధర్‌, అదనపు ఆరోగ్య శాఖ అధికారి డా. సునీల్‌, ఈఈ మల్లికార్జున ప్రసాద్, డీఈ (ఎలక్ట్రికల్‌) సరస్వతి, ఏవీఎస్వో కృష్ణమూర్తి, ఎస్‌వీబీసీ సీపీఓ శ్రీ, పలువురు పోలీసు అధికారులు, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:Sri Mahalakshmi Deepa Puja in Kuppam on October 20