రాజకీయాల్లోకి వచ్చి 10 రోజులే.. ఏకగ్రీవంగా ఎన్నిక..!
రాజంపేట ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 24 ఏళ్ల దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీకి చెందిన ఆమె ఈ పదవి చేపట్టనున్న అతి పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు.
ఈ ఏడాదే బీడీఎస్ వైద్య విద్యను పూర్తి చేసిన గాయత్రి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేవలం పది రోజుల్లోనే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎంపిక కావడం విశేషంగా మారింది.
ఆమె తండ్రి దొంతం శివప్రసాద్ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
వైద్య విద్య నుంచి రాజకీయాల్లోకి.. అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం వరకు గాయత్రి ప్రయాణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:Municipal Chairperson at just 24 years old..!!