October 26, 2026
Explore
రాయచోటిలో భర్త ఇంటి ముందు భార్య నిరసన

రాయచోటిలో భర్త ఇంటి ముందు భార్య నిరసన

October 26, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, చెన్నముక్కపల్లి రాజుల కాలనీలో సోమవారం సాయంత్రం వింత ఘటన జరిగింది. సుజాత అనే మహిళ తన భర్త తరిగొండ మల్లేశ్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరం చేశాడని, ఇప్పుడు తల్లిదండ్రుల బలవంతంతో మరో పెళ్లి చేశారని ఆరోపించింది. “నా భర్త నాకు కావాలి, నాకు న్యాయం చేయండి” అంటూ పోలీసులు, మీడియాను వేడుకుంటోంది. పోలీసులు స్పందించాల్సి ఉంది.

Tags:Wife protests in front of husband’s house in Rayachoti