- 27 న అంత్యక్రియలు
-ఎమ్మెల్యే,ఎంపి సంతాపం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని జమీందారు రాజ ఉదయ్‌శంకర్‌రాయల్ సతీమణి రాణి విజయమ్మ(70) సోమవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి లు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. కాగా వయోభారంతో ఉన్న ఆమె మృతి చెందడంతో పట్టణ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ప్రతి యేటా శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర జమీందారుల ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రజలకు విధితమే. కాగా జమీందారిని భౌతికయాన్ని మంగళవారం ప్యాలెస్ ఆవరణంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు ఆమె కుమారుడు రాజామల్లికార్జునరాయల్ తెలిపారు. అనంతరం వారి కులసాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను తూర్పువెహోగసాలలోని చిట్టారిమఠం ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Tags:Death of Punganur Zamindar Rani Vijayamma