October 26, 2026
Explore
చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నవదంపతులు దుర్మరణం

చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నవదంపతులు దుర్మరణం

October 26, 2026 | Andhra Pradesh

కర్ణాటకముచ్చట్లు:

చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి తాలూకా చిన్నసంద్ర సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చింతామణికి చెందిన షణ్ముఖ్ (27), మిథులా (24) అనే నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదు నెలల క్రితమే వివాహమైన ఈ జంట మృతితో కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:Tragic road accident near Chintamani; newlywed couple killed