October 23, 2026
Explore
ఏపీలో ఎన్నికల నామినేషన్ల వేళ హింస.. 31 ఘటనలు నమోదు!

ఏపీలో ఎన్నికల నామినేషన్ల వేళ హింస.. 31 ఘటనలు నమోదు!

October 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

22 దాడులు.. 9 చోట్ల నామినేషన్ పత్రాల ధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 31 హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది.

వీటిలో 22 దాడుల ఘటనలు కాగా, మరో 9 చోట్ల నామినేషన్ పత్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేయగా, 54 మంది నిందితులను గుర్తించినట్లు పేర్కొంది.

ఎన్నికల సమయంలో హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. హింసను ప్రేరేపించే వారిపై నాన్‌-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

అభ్యర్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అదనపు పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది.

Tags:Violence during election nominations in AP… 31 incidents recorded!