తంబళ్లపల్లె ముచ్చట్లు:
తంబళ్లపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా పరిశీలించారు.
నేడు నామినేషన్ల సమర్పణకు చివరి రోజు కావడంతో కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి సాగేలా అన్ని రకాల ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు తెలిపారు.
అనుమతి లేకుండా గుంపులుగా రావడం, ర్యాలీలు నిర్వహించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.
Tags:SP Dheeraj Kunubilli inspected the MPTC nomination center