October 23, 2026
Explore
నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు

నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు

October 23, 2026 | Andhra Pradesh

గాలివీడుముచ్చట్లు:

ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ సూచించారు.

Tags:Tight security at the nomination center