ములకలచెరువు ముచ్చట్లు:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ములకలచెరువు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే. దస్తగిరి తెలిపారు.
ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన పోలీసు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ కే. దస్తగిరి ఒక ప్రకటనలో కోరారు.
Tags:Tight security arrangements for local body elections: CI K. Dastagiri