మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె జెడ్పీటీసీ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే వెంటనే తెలపాలని టౌన్ సీఐ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. ఎస్పీ ధరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలోని జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత కల్పించామన్నారు. నామినేషన్ పత్రాలు చించే ప్రయత్నం చేసినా, అభ్యంతరం చెప్పేందుకు వచ్చినా బాధితులకు భద్రత కల్పించి, కేంద్రానికి తీసుకెళ్లి దగ్గరుండి నామినేషన్ వేయిస్తామని తెలిపారు.
Tags;”Let us know if anyone obstructs the filing of nominations; we will provide security,” says CI Rafi.