October 23, 2026
Explore
అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేయండి: డీఎస్పీ ప్రసాద్ బాబు

అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేయండి: డీఎస్పీ ప్రసాద్ బాబు

October 23, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో ఎంపీటీసీ అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేయాలని మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ బాబు తెలిపారు.

వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎలాంటి భయం లేకుండా నామినేషన్ కేంద్రాలకు వచ్చి తమ నామినేషన్లు దాఖలు చేయాలని ఆయన సూచించారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో తమ నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Tags;Candidates, file your nominations without any fear: DSP Prasad Babu