October 23, 2026
Explore
నామినేషన్ అడ్డుకుంటే కఠిన చర్యలు: అడిషనల్ ఎస్పీ

నామినేషన్ అడ్డుకుంటే కఠిన చర్యలు: అడిషనల్ ఎస్పీ

October 23, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులను అడ్డుకుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు బాధితులకు భద్రత కల్పించి, నిర్భయంగా నామినేషన్ వేయించి ఇంటికి చేరుస్తామని చెప్పారు. పత్రాలు చించే ప్రయత్నం చేసినా చర్యలు తప్పవన్నారు.

Tags;Strict action if nomination process is obstructed: Additional SP